పరిగిలో ఘనంగా సిపిఐ అవిర్భావ దినోత్సవ వేడుకలు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
భూమి కోసం భూక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం చారిత్రక సాయుధపోరాటాలు నిర్వహించిన భారత కమ్యూనిస్టు పార్టీ నూరు వసంతాలు వేడుకకు వేదికైనా లాల్ జెండాకు రెడ్ సెల్ల్యూట్.
భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) 100వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా సిపిఐ పార్టీ జెండాను పరిగి పట్టణ కేంద్రంలో ఎగురవేయడం జరిగింది
ఈ సందర్భంగా సీపీఐ పరిగి డివిజన్ కార్యదర్శి పీర్ మహ్మద్, వ్యవసాయ కార్మిక సంఘం BKMU జిల్లా కార్యదర్శి ఎం.వెంకటేష్ మాట్లాడుతూ పార్టీ 100 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ శ్రేణులకు శుభాకాంక్షలు
ఈనెల 30వ తేదీన నల్లగొండ జిల్లాలో జరిగే పార్టీ ఆవిర్భావ ప్రారంభోత్సవ బహిరంగ సభ ర్యాలీనిజయప్రదం చేయగలరు త్యాగాల చరిత్ర పోరాటాల చరిత్ర కలిగిన సిపిఐ పార్టీ జెండా పట్టుకొని నిరంతరం పేద ప్రజల పక్షాన పోరాడతామని అన్నారు బడుగు బలహీన వర్గాల కోసం అనునిత్యం పోరాడేది కేవలం సిపిఐ జెండా మాత్రమేనని అట్లాంటి ఎర్రజెండా వంద సంవత్సరాలు పూర్తి చేసుకోవడం అందులో అనేక త్యాగదనులతో నిండిన వారసత్వాన్ని పోరాటాన్ని పునికిపుచ్చుకొని ముందుకు నడవాలని ఓట్లు సీట్లు ఎత్తుల చిత్తుల ప్రలోభాలకు లొంగకుండా రాగదేశాలకు అతీతంగా కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా పోరాడేది పోరాడుతున్నది కేవలం సిపిఐ మాత్రమేనని వారు అన్నారు
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జంగయ్య,యాదయ్య,రంచేద్రయ్య, బస్సప్ప, రాములు మల్లేష్,యాదగిరి,రామయ్య,శేఖర్,అశోక్ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App