చెత్తకుప్పలో ఆడ శిశువు.. కంచికచర్ల గ్రామంలో అమానుషం
Trinethram News : కంచికచర్ల డిసెంబర్ 26 కంచికచర్లలో దారుణం అమానవీయ ఘటన గురువారం చోటుచేసుకుంది. కంచికచర్ల ప్రధాన రహదారి రాజ్యలక్ష్మి గ్యాస్ కంపెనీ సమీపంలో చెత్త కుండీలో ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్లారు. అటుగా వెళుతున్న స్థానికులకు చెత్త కుండీలో నుండి శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులు శిశువుని దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రమునకు తరలించారు. శిశువుపై చీమలో పురుగులు పట్టి ఉండటంతో వైద్యులు చికిత్స అందించి ఐసిడిసిఅధికారులకు అప్పజెప్పడంతో వారు మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App