రోడ్లపై గుంతలు.
డిండి గుండ్లపల్లి త్రినేత్రం న్యూస్.
డిండి దేవరకొండ రహదారి గుంతల మయం.
వాహనాదారులకు ఇబ్బంది కరం పట్టించుకోని అధికారులు ప్రజా ప్రతినిధులు.
ఈ రహదారి గుండా రోజుకు కొన్ని వందల మంది ప్రయాణం చేస్తుంటారు. రోడ్డు బాబుగా లేనందు వల్ల ప్రయాణికులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లపై గుంతలు ఉండటం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. భారీగా కురిసిన వర్షాల కారణంగా రోడ్డు పూర్తిగా దెబ్బతిని కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి
దీన్ని మండలంలోని 38 గ్రామ పంచాయతీల ప్రజలు సరుకుల కొనుగోలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పనుల నిమిత్తం ప్రతినిత్యం మండల కేంద్రానికి వస్తుంటారు. ఈ సందర్భంలో ప్రయాణికులు ప్రమాదానికి గురైన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ రోడ్డు గుండా ప్రయాణించే ప్రయాణికులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పోతున్నారు.. రాత్రి సమయంలో ప్రయాణం ఇబ్బందికరంగా ఉంది.
ఈ మార్గం గుండా ప్రయాణం చేయాలంటే ఇబ్బందికరంగా ఉంది. ముఖ్యంగా రాత్రిపూట ఏదైనా ఆపద వస్తే ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే మండల ప్రజలు పలుమార్లు ప్రమాదాల కు గురవుతున్నారు.
అధికారులు, ప్రజా ప్రతినిధులు వెంటనే స్పందించి రోడ్డు మర మత్తు పనులు ప్రారంభించాలని డిండి మండల ప్రజలు కోరుతున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App