శ్రీ చైతన్య హై స్కూల్, విద్యార్థుల స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండంలోని ఎన్టిపిసి టౌన్షిప్ లోని, శ్రీ చైతన్య హై స్కూల్ యాజమాన్యం “బేటి సమాన్-రెస్పెక్ట్ గర్ల్స్” అనే స్మార్ట్ లివింగ్ ప్రోగ్రాం ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డా.వి.రజిత(C.A.S) మరియు అతిథిగా ఎం.మమత (శ్రీ .లాస్ట్ ), ఈఎస్ఐ డిస్పెన్సరీ ఎన్టిపిసి రామగుండం హాజరయ్యారు. ముఖ్య అతిథి డా.వి.రజిత మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సమాజంలో ఆడవారి పట్ల మర్యాదపూర్వకంగా ఎలా ఉండాలో అవగాహన కల్పించడంతోపాటు విద్యార్థినిలకు గుడ్ టచ్ & బ్యాడ్ టచ్ గురించి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం విద్యార్థిని విద్యార్థులు పాఠశాల నుండి ఎఫ్ సి ఐ క్రాస్ రోడ్డు చౌరస్తా వరకి రెస్పెక్ట్ గర్ల్స్ నినాదాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. పాఠశాల ప్రిన్సిపల్ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ శ్రీ చైతన్య యాజమాన్యం ప్రతి నెల సమాజానికి ఉపయోగపడే ఇటువంటి స్మార్ట్ లివింగ్ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ నమ్రత, క్యాంపస్ ఇంచార్జ్ నరేంద్ర కుమార్, డీన్ అనిల్ కుమార్, ప్రైమరీ ఇన్చార్జి శైలజ, పి.ఈ.టి శృతి విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App