రుణమాఫీ కాలేదంటే రాజీనామాకు సిద్ధం ..
నిరూపిస్తే రాజీనామా చేస్తావా ..
కేటీఆర్ కు విజయ రమణారావు సవాల్
అసెంబ్లీలో బిఆర్ఎస్ పై ధ్వజమెత్తిన
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఎమ్మెల్యే విజయరమణ రావు
రైతుల సంక్షేమం కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యపడుతుందని, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావాలని ప్రభుత్వం పై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ,10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రైతులను రుణమాఫీ పేరిట మభ్యపెట్టి మోసం చేశారని మండిపడ్డారు. రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 4 విడతల్లో రూ.1లక్ష చేసిన రుణమాఫీ వడ్డీలకే సరిపోలేదన్నారు. ఇది రైతులను మోసం చేయడం కాదా అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ఏకకాలంలో రూ.
2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతోందన్నారు. రుణమాఫీ కాలేదని ప్రతిపక్ష నాయకులు కేటీఆర్ పేర్కొనడం దారుణమని అన్నారు. పదేపదే అబద్ధాలు వల్లించి దానినే నిజంగా చూపే ప్రయత్నం కేటీఆర్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ కు దమ్ము, ధైర్యం, చీము, రక్తం ఉంటే పెద్దపల్లి నియోజకవర్గానికి వస్తే దాదాపు 90 శాతం రుణమాఫీ జరిగింది చూపిస్తానని విజయ రమణారావు స్పష్టం చేశారు. నిరూపించకుంటే తాను రాజీనామాకు సిద్ధమని ఆయన సవాల్ చేశారు. లేకుంటే కేటీఆర్ రాజీనామా చేయాలని విజయ రమణారావు డిమాండ్ చేశారు. సన్నవడ్ల కు ఒక్క తన పెద్దపెల్లి నియోజకవర్గంలోనే రూ.51 కోట్ల బోనస్ రైతులకు లభిస్తున్నాయని, ఇందులో రూ. 46 కోట్లు రైతుల ఖాతాలో జమ అయ్యాయని చెప్పారు. కాలేశ్వరం ప్రాజెక్టు కట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతాంగాన్ని నిలువునా ముంచారని మండిపడ్డారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఒక్క చుక్క నీరు అందించలేదని అన్నారు. కెసిఆర్, కేటీఆర్, హరీష్ రావులు తమ ప్రాంతానికి ఇక్కడి నుండి గోదావరి జిల్లాలను తీసుకువెళ్లేందుకే ప్రయత్నం చేశారని పేర్కొన్నారు. మూడేళ్లు కాకముందే కాలేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, లక్షలాది రూపాయలు నీటిపాలు అయ్యాయని అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో నిర్మించిన ప్రాజెక్టు లు నేటికీ చెక్కుచెదరలేదని ఆయన గుర్తు చేశారు. ధాన్యం కొనుగోళ్ల సందర్భంగా రైస్ మిల్లర్లతో కుమ్మక్కై వడ్ల కటింగ్ పేరిట అందినంత దోచుకున్న చరిత్ర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలదని ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App