TRINETHRAM NEWS

వార్షిక తనీఖీల్లో భాగంగా గోదావరిఖని ఏసిపి కార్యాలయమును తనిఖి చేసిన సిపి

త్రినేత్రం న్యూస్ గోదావరిఖని ప్రతినిధి

రామగుండము పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని ఏసిపి కార్యాలయమును రామగుండం పోలీస్‌ కమిషనర్‌ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి తనీఖీ చేశారు. తనీఖీ లో భాగంగా ఏసిపి కార్యాలయమునకు చేరుకున్న పోలీస్‌ కమిషనర్‌ ఏసీపీ మొక్కను అందజేసి స్వాగతం పలకారు. అనంతరం పోలీస్‌ కమిషనర్‌ ఏసిపి కార్యాలయమునకు సంబంధించిన రికార్డులను పరిశీలించడంతో పాటు, ఏసిపి అధ్వర్యంలో దర్యాప్తు జరిగిన కేసుల ప్రస్తుత స్థితిగతులపై గ్రేవ్‌ కేసుల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు జరుగుతున్న తీరును సీపీ ఏసీపీ రమేష్ అడిగి తెలుసుకొవడంతో పాటు, పెండింగ్‌లో వున్న ఎస్సీ ఎస్టీ కేసులు, ఇతర గ్రేవ్‌ కేసుల వివరాలకు సంబంధించిన రికార్డులను పోలీస్‌ కమిషనర్‌ పరిశీలించారు. ఈ సందర్బంగా గోదావరిఖని సబ్‌`డివిజినల్‌ పోలీస్‌ అధికారులతో కమిషనర్‌ మాట్లాడుతూ… శాంతి భద్రతల విషయంలో పోలీస్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించేది లేదని, నేరాల కట్టడి కొసం అధికారులు సమిష్టిగా సమన్వయము తో మరింత శ్రమించడంతో పాటు, నేరం జరిగిన వెంటనే అధికారులు వేగంగా స్పందించాలని, చట్టాలను అతిక్రమించే చర్యలకు పాల్పడే వారిని ఎట్టిపరిస్థితిలో వదలవద్దని, పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏం జరుగుతోందని ఎప్పటికప్పుడు పరిశీలించడంతో పాటు, ముందస్తూ సమాచార సేకరణ అవరమని, క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ఓపిక, సహనంతో ప్రజలు ఇచ్చే ఫిర్యాదుల పరిశీలించాలని పోలీస్‌ కమిషనర్‌ అధికారులకు తెలిపారు. నేరాల నియంత్రణకు విసబుల్ పోలీసింగ్, నిరంతర పెట్రోలింగ్ తో పాటు, ఆకస్మిక వాహన తనిఖీ లు నిర్వహించాలని ముందస్తు నేరా నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలనీ సూచించారు.

ఈ తనీఖీలో పెద్దపల్లి డీసీపీ చేతన ఐపిఎస్., గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్ర సేనా రెడ్డి, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ రావు, మంథని సీఐ రాజు, తదితరులు పాల్గోన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App