ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను
తెలంగాణ రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని
ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ఎస్సీ ఏకసభ్య కమిషన్ చైర్మన్ కు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో గురువారం వినతి పత్రం సమర్పించారు.
త్రినేత్రం న్యూస్ తెలంగాణ ప్రతినిధి
ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ ఆవశ్యకతను గుర్తించి వర్గీకరణ చేయాలని రాష్ట్రాలకు సూచించిన విషయంపై
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఇచ్చిన మాట ప్రకారం వర్గీకరణ అమలు జరగాలని కోరారు. గత 30సంవత్సరాల నుండి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఎస్సీ వర్గీకరణ జరగాలని ఉద్యమాలు చేస్తున్న విషయం ఎస్సీ ఏకసభ్య కమీషన్ చైర్మన్ దృష్టికి ఎంఆర్పీఎస్ నాయకులు తీసుకెళ్లారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ డిమాండ్ న్యాయబద్ధతమైందని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని ఎంఆర్పీఎస్ నాయకులు తెలిపారు. తరతరాలుగా అణిచివేతకు గురవుతున్న మాదిగ, మాదిగ ఉపకులాలు రిజర్వేషన్ల వర్గీకరణ అమలుతో రిజర్వేషన్ల ఫలాలను పొందే వీలు అవుతుందని వెంటనే ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రామగుండం కార్పొరేషన్ ఇంచార్జ్ గుండ్ల రాకేష్, మహేష్, పవన్, ప్రణీత్, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App