రుయా అభివృద్ధికి ప్రతిపాదనలు రేడీ చేయండి: ఎమ్మెల్యే ఆరణి
Trinethram News : తిరుపతి
ఉప్పరపల్లి వద్ధ జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని బుధవారం ఉదయం ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు పరామర్శించారు. వారికి అందిస్తున్న చికిత్స వివరాలను సూపరిండెంట్ రవి ప్రభును అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం క్షతగాత్రులకు అందించాలని సూపరిండెంట్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. క్షతగాత్రులను పరామర్శించే సమయంలో ఆసుపత్రి పై పెచ్చులు ఊడటాన్ని ఊడి ఉండటాన్ని ఆయన పరిశీలించారు. ఆస్పత్రిలోని ఏ ఏ భవంతుల్లో పెచ్చులు ఊడయో వాటి మరమ్మతుకు అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన సూపరిండెంట్ ను ఆదేశించారు. త్వరలో జరిగే హెచ్ డి ఎస్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్ ఎం ఓ హరికిరణ్, వైద్యులు, జనసేన నగర అధ్యక్షులు రాజారెడ్డి, బాబ్జీ, సుధాకర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App