కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేశినేని శివనాథ్
Trinethram News : ఢిల్లీ : కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కి ఎంపి కేశినేనిశివనాథ్ తన సహచర టిడిపి ఎంపిలతో కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 38వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కింజరాపు రామ్మోహన్ నాయుడు జన్మదిన వేడుకలు బుధవారం పార్లమెంట్ లోని టిడిపి పార్టీ కార్యాలయంలో టిడిపి ఎంపీలందరూ కలిసి ఘనంగా నిర్వహించారు. టిడిపి ఎంపీలు రామ్మోహన్ నాయుడుకి పుష్పగుచ్చం అందించి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం రామ్మోహన్ నాయుడు కేక్ కట్ చేసి..తనకి శుబాకాంక్షలు తెలిపిన ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు విమానయాన రంగాన్ని అభివృద్ది విషయంలో పరుగులు పెట్టిస్తున్నారని ఎంపి కేశినేని శివనాథ్ కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయులు, విజయనగరం ఎంపి కె.అప్పలనాయుడు, నెల్లూరు ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి , ఒంగోలు ఎంపి మాగుంట శ్రీనివాసులు రెడ్డి ,వైజాగ్ ఎంపి మతుకుమిల్లి శ్రీభరత్ , కర్నూలు బస్తిపాటి నాగరాజు, అనంతపురం ఎంపి లక్ష్మీనారాయణ, నంద్యాల ఎంపి బైరెడ్డి శబరి, చిత్తూరు ఎంపి దగ్గుమళ్ల ప్రసాదరావు, అమలాపురం ఎంపి హరీష్ మాథుర్, బాపట్ల ఎంపి తెన్నేటి కృష్ణ ప్రసాద్, హిందూపురం ఎంపి బికె పార్థసారధి, మాజీ రాజ్యసభ ఎంపి రవీంద్ర కనకమేడల పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App