TRINETHRAM NEWS

నేడు తెలంగాణలో మరోసారి రాష్ట్రపతి పర్యటన!

Trinethram News : హైదరాబాద్‌ : డిసెంబర్ 17
హైదరాబాద్ నగరానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ మంగళవారం రానున్నారు. ఈ నేపథ్యం లో బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో పోలీస్‌, రెవె న్యూ, ఆర్‌ అండ్‌బీ, వైద్య ఆరోగ్యశాఖ, అగ్నిమాపక, అటవీ, విద్యుత్‌, తదితర శాఖల ఏర్పాట్లపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి సమీక్ష నిర్వహించారు.

రోడ్లపై ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నం కాకుండా భద్రత ఏర్పాట్లు, బందోబస్తును పర్యవేక్షించాలని పోలీసులకు సూచించారు. రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన సందర్భంగా పోలీసులు పలు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్లు, పారా గ్లైడర్లు ఎగరవేస్తే చట్టపర మైన చర్యలు తప్పవని సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App