విపక్షాల ఆందోళనల మధ్య మూడు కీలక బిల్లులకు ఆమోదం
Trinethram News : హైదరాబాద్ : డిసెంబర్ 17
విపక్షాల నిరసనల మధ్య తెలంగాణ శాసనసభ సమావేశాలు కొనసాగు తున్నాయి. లగచర్లకు రైతులకు బేడీల అంశంపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి.
బీఆర్‌ఎస్, బీజేపీలు వాయిదా తీర్మానాల కోసం డిమాండ్ చేశాయి. మరో వైపు బీఆర్‌ఎస్, బీజేపీ శాసనసభ్యుల నిరసన మధ్య మూడు కీలక బిల్లులకు సభ ఆమోదం తెలిపింది.
స్పోర్ట్స్ యూనివర్సిటీ బిల్లును మంత్రి కొండా సురేఖ అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. వెంటనే సభ ఆమోదం తెలిపింది. తెలంగాణ యూనివర్సిటీ సవరణ బిల్లును మంత్రి దామోదర రాజనర్సింహ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు.
దీనికి కూడా ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం లభించింది. జీఎస్టీ సవరణ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్, బీజేపీ సభ్యుల నిరసనల మధ్య ఈ మూడు బిల్లులను సభ ఆమోదించింది.
అనంతరం టూరిజం పాలసీపై స్వల్పకాలిక చర్చ తర్వాత సభ బుధవారానికి వాయిదా పడింది..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App