చదువుల తల్లి “సరస్వతీ మాత” విగ్రహాన్ని ఆవిష్కరించిన పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్.
త్రినేత్రం న్యూస్ పెద్దపల్లి ప్రతినిధి
ఈరోజు జూలపల్లి మండల సింగిల్ విండో చైర్మన్ కొంజర్ల వెంకటయ్య జన్మదిన సందర్భంగా వారు జూలపల్లి మండల కేంద్రంలోని బాలికల జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో సరస్వతీ మాత విగ్రహ స్థాపనకు కృషి చేయగా ముఖ్యఅతిథిగా పెద్దపల్లి జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ హాజరై సరస్వతి మాత విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాలవేసి, ప్రార్థన చేసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా రఘువీర్ సింగ్ మాట్లాడుతూ కొంజర్ల వెంకటయ్య ఈ పాఠశాల ఆవరణలో చదువుల తల్లి సరస్వతి మాత విగ్రహాన్ని నెలకొల్పడం చాలా గొప్ప విషయం అని, ప్రతిరోజు ప్రతీ విద్యార్థిని ఉదయాన్నే చదువుల తల్లిని ప్రార్థించి, అమ్మవారి ఆశీస్సులు తీసుకొని చదువులో బాగా రాణించి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు. జూలపల్లి మండల కేంద్రంలో కొంజర్ల వెంకటయ్య చేసిన సేవలను గుర్తు చేసుకొని కొనియాడుతూ, ఇంత చక్కని ఆలోచన చేసిన వారిని అభినందిస్తూ, వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అలంకరించాలని కోరుతూ, శాలువాతో సత్కరించడం జరిగింది
ఈ కార్యక్రమం లో దూలికట్ట సింగిల్ విండో చైర్మన్ పుల్లూరి వేణుగోపాల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లోక రవీందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి సభ్యుడు అమరగాని ప్రదీప్ కుమార్, కో- ఆప్షన్ సభ్యులు లాల్ మహమ్మద్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు పొలగాని సతీష్, బండి రాజన్న, అట్ల ఆంజనేయులు, ఎండి అంకూస్, పురుషోత్తం, మనమండ్ల శ్రీనివాస్, కిష్టయ్య, భూమయ్య మేరుగు రమేష్, మేర శ్రీను, కనుకయ్య, రమేష్, అశోక్, సాయిప్రసాద్, వివిధ కుల సంఘాల సభ్యులు, గ్రామ ప్రజలు, ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App