TRINETHRAM NEWS

ఆశా వర్కర్లకు నెలకు 18వేలు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించలి.
__పి.జయ లక్ష్మీ, రాష్ట్ర అధ్యక్షురాలు, తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ )

త్రినేత్రం న్యూస్ తెలంగాణ ప్రతినిధి

సీఐటీయూ అనుబంధ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 15 న నిర్మల్ జిల్లాలో ప్రారంభమైన రాష్ట్ర బస్సు జాత ఈరోజు ఉదయం 10 గంటలకు గోదావరిఖని కి చేరుకుంది.

ఈసందర్భంగా సీఐటీయూ జిల్లా అధ్యక్షులు వేల్పుల కుమారస్వామి నాయకత్వంలో సీఐటీయూ నాయకులు, ఆశా కార్యకర్తలతో మున్సిపల్ కార్యాలయం, అంబేడ్కర్ విగ్రహం వద్ద
జాత బృంద నాయకులు పి.జయ లక్ష్మీ , ఆర్.నీలాదేవి, పి.గంగమని,ఆర్.సాధన, ఎన్.పద్మ, కె.సునీత, ఎం.బాలమని గర్లను స్వాగతించారు. అనంతరం జాత బృంద నాయకులు అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
పి.జయ లక్ష్మీ మాట్లాడుతూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. బి.ఆర్.ఎస్. కంటే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తమని,వేతనాలు పెంచుతామని,దీంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తాం అని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో పొందుపరచడం జరిగిందని అన్నారు.
ఆశాల ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేటికీ వాటిని అమలు చేయలేదని అన్నారు.
ఈ మధ్యకాలంలో
అశాలకు ఫిక్సిడ్ వేతనం 18 వేలు ఇవ్వాలని,ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆరోగ్యశాఖా మంత్రి రాష్ట్ర ఉన్నతాధికారులకు మరియు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యే లకు,మంత్రులకు ఆశా వర్కర్స్ అనేకసార్లు వినతి పత్రాల ద్వారా విజ్ఞప్తులు చేయడం జరిగింది.అయినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్స్ సమస్యలు పట్టించుకోక పోవడం వల్లనే ఈ రోజు బస్సు జాత చేయాల్సి వచ్చిందని అన్నారు. ఈ బస్సు జాత డిసెంబర్ 31 వరకు కొనసాగుతుందని అన్నారు. ఇప్పటికైన ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు నెలకు 18 వేల వేతనం నిర్ణయం చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా పి.ఎఫ్, ఇ.ఎస్.ఐ. ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
అదే విధంగా దేశ వ్యాప్తంగా సీఐటీయూ స్కీం వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని అనేక పోరాటాలు నిర్వహిస్తుంది. దీని ఫలితంగా 2013లో జరిగిన 45వ లేబర్ ఇండియన్ కాన్ఫరెన్స్ సమావేశం స్కీం వర్కర్లలో భాగమైన ఆశాలను కార్మికులుగా గుర్తించి,కనీస వేతనాలు,పి.ఎఫ్,
ఇ.ఎస్.ఐ. ఉద్యోగ భద్రత కల్పించాలని తీర్మానం చేసింది. కానీ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 సంవత్సరాలు గడిచినా ఆ సిఫారసులను మాత్రం అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికైన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అశాల సమస్యలు పరిష్కరించని పక్షంలో ఆందోళనలు, పోరాటాలు ఉదృతం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి ఎం.రామా చారి, ఉపాధ్యక్షులు ఎన్.బిక్షపతి, జిల్లా కమిటీ సభ్యులు నెర్వట్ల నర్సయ్య, జి.లక్ష్మారెడ్డి, ఆశా కార్యకర్తలు పుష్ప లత,రాజ కుమారి, నాగ జ్యోతి, రాధ, .శ్రీలత,మంజుల, .సృజన,దీప,మహేశ్వరి, సుజాత,వాణి,వర లక్ష్మీ, రాజయ్య,టి.నరహరి, రవి,బాల కృష్ణ, ఎ.నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App