TRINETHRAM NEWS

చలిగాలి.. జాగ్రత్తగా మెలగాలి

రక్షణ చర్యలు తీసుకోకుంటే ముప్పే

జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

త్రినేత్రం న్యూస్ తెలంగాణ ప్రతినిధి

ఈ ఏడాది చలి తీవ్రత పెరిగి నవంబర్ నుంచే తన ప్రతాపాన్ని చూపెడుతోంది. చలి తీవ్రత పెరుగుతుండడంతో సాయంత్రం నుంచే ప్రజలు ఇళ్లకు చేరుకుంటున్నారు. రాత్రి వేళల్లో ప్రజలుకు జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ..బయటకు వేళ్లేందుకు వణికిపోతున్నారు. ఉదయం 9 గంటల వరకు కూడా చలి తీవ్రత తగ్గకపోవడం తో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లే వారు స్వెటర్లు, శాలువాలు ఇతర రక్షణ దుస్తులు ధరించి వెళ్తున్నారు. చలి తీవ్రత పెరుగుతున్నందున జాగ్రత్త చర్యలు తీసుకోకుంటే వ్యాధుల భారిన పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

ప్రజలకు పలు సూచనలు తెలియజేస్తున్నాము

రక్తపోటు, జలుబు, దగ్గు, శ్వాస సంబంధిత ఆస్తమా, సీఓపీడీ, హైపో థైరాయిడ్, ఎనీమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్లు జాగ్రత్తలు పాటించాలి

శరీరంలో ఉండే కొవ్వు చలి నుంచి మనల్ని రక్షిస్తుంది. ఎక్కువ బరువు ఉన్నవారికి తక్కువ చలి వేస్తుంది. దీనికి కారణం చెడు అలవాట్లు, డిహైడ్రేషన్, రక్త ప్రసరణ తగ్గిపోవడం, రక్తంలో ఎర్ర రక్త కణాలు తగ్గడం చలికాలంలో పాటించాల్సిన జాగ్రత్తలు

1.పిల్లలు, వృద్ధులు సూర్యోదయం కంటే ముందు బయటకు రాకూడదు
2.చలి నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు స్వెటర్లు, హ్యాండ్ గ్లోవ్స్, మాస్క్లు, సాక్స్లు ధరించాలి
3.కూల్ డ్రింక్స్ తాగకూడదు. ఆహారం, నీరు గోరువెచ్చగా ఉండేలా చూసుకోవాలి
4.ఉదయం, సాయంత్రం గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల చలినుంచి కొంత ఉపశమనం కలుగుతుంది

5.గుండె జబ్బులు, శ్వాస సంబంధిత దీర్ఘకాలిక రోగాలు ఉన్నవారు మార్నింగ్ వాకింగ్, జాగింగ్ మానేసి సాయంకాల సమయంలో 6 గంటల లోపు చేస్తే మంచిది

6.ఏసీలు, కూలర్లు, ఫ్యాన్ల వాడకం తగ్గించాలి

7.చలిమంటలు కాగకూడదు. మంచుకురిసే సమయంలో బయట తిరగొద్దు
8.చర్మం, పెదవులు పగుళ్లకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి
9.ఆరోగ్య సమస్యలు వస్తే వైద్యులను సంప్రదించి సలహాలు, సూచనలు, చికిత్స పొందాలి
10.చలితో చిన్న పిల్లలు, వృద్ధులు ఎక్కువ ఇబ్బంది*