TRINETHRAM NEWS

సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్!

కలం నిఘా: న్యూస్ ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా: డిసెంబర్ 14
దేశ సరిహద్దుల్లో బాంబుల తో గర్జనలు చేసే యుద్ధ ట్యాంకర్లు..ఈరోజు సంగా రెడ్డి జిల్లా మల్కాపూర్ చెరువులో ప్రత్యక్షమయ్యా యి. భారీ ఆకారంతో యుద్ధ మైదానా ల్లో పరుగులు తీసే ఈ ట్యాంకర్లు చెరువులో పడవల ప్రయాణిస్తూ.. స్థానిక ప్రజలను ఆకట్టు కున్నాయి.

సంగారెడ్డి జిల్లాలోని ఎద్దు మైలారం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లో యుద్ధ ట్యాంకర్లను తయారు చేస్తున్నారు. ఇక్కడ నుంచే వీటిని భారత సైన్యానికి అంది స్తుంటారు. ఇవి దేశం నలుమూలల భారత సైనిక దళాల్లో చేరి విధులు నిర్వహిసుంటాయి.

అలాంటి ట్యాంకర్లు కఠినమైన మైదానంలోనే కాకుండా.. నీటిలోనూ ప్రయాణం సాగించేందుకు వీలుగా రూపొందించారు. యుద్ధక్షేత్రాల్లో ఎక్కడైనా కాలువలు, నదులు ఎదురైతే ఆ అడ్డంకులను సులువుగా అధిగమించేలా వీటిని డిజైన్ చేశారు.

ఈ కారణంగానే యుద్ధ ట్యాంకర్లను మల్కాపూర్ లోని మైదాన ప్రాంతాలతో పాటు ఇక్కడి చెరువులో నూ ట్రైయల్ రన్ నిర్వహించారు. నీటిలో ప్రయాణించేటప్పుడు ఇవి ఏ తీరుగా పనిచేస్తున్నా యో శాస్త్రవేత్తల బృందం పరీక్షించింది.

ఈ సమయంలో యుద్ధ ట్యాంకర్లు, వాటి విన్యా సాలను వీక్షించేందుకు స్థానిక ప్రజలు గుమ్మిగు డారు. వీటి విన్యాసాలు ప్రయాణాన్ని చూసి స్థానికులు ఆశ్చర్యపడ్డారు.

ఎద్దుమైలాపూర్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన ఈ యుద్ధ ట్యాంకర్.. ఒక్కొక్క టి 14.5 టన్నుల బరువుతో రూపొందించారు. ఈ ట్యాంకర్ పై ఒకేసారి పదిమంది ప్రయాణం చేసే అవకాశం ఉంది. నేల మీదే కాకుండా నీటిలో ప్రయా ణించే సమయంలోనూ ఈ ట్యాంకర్ పై పదిమంది ప్రయాణించవచ్చని చెబుతున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App