పాఠశాలలో పరిశుభ్రతకు లోటు లేకుండా ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్
*సుల్తానాబాద్ లోని బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్
పెద్దపల్లి, డిసెంబర్ 14: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రభుత్వ గురుకులాల్లో, రెసిడెన్షియల్ పాఠశాలల్లో పరిశుభ్రతకు ఎక్కడా లోటు లేకుండా సంబంధిత ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ అన్నారు.
శనివారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మండలం బాలికల బిసి గురుకుల పాఠశాలను సందర్శించి ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలకు అనుగుణంగా రూపొందించిన కొత్త డైట్ మెన్యూ ను ప్రారంభించారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ మాట్లాడుతూ, గతంలో నిర్లక్ష్యం వహించిన డీఎస్సీని ప్రభుత్వం ఏర్పడిన వెంటనే చేపట్టి 11 వేల మంది టీచర్లను ప్రజా ప్రభుత్వం భర్తీ చేసిందని, ప్రభుత్వం ఏర్పడిన తొలి సంవత్సరంలోనే 55 వేల 143 నిరుద్యోగులకు నియామక పత్రాలు అందించామని, ప్రభుత్వంలో ఉన్న ఖాళీల భర్తీకి జాబ్ క్యాలెండర్ ప్రకటించామని అన్నారు.
పాఠశాలలో పరిశుభ్రతకు ఎక్కడ లోటు లేకుండా అధ్యాపకులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, అధ్యాపకులు అంతే జాగ్రత్తగా చూసుకోవాలని, మన గురుకులాల్లో చదివే పిల్లల పట్ల మనం బాధ్యతతో ఉండాలని తెలిపారు.
పిల్లలకు అందించే పౌష్టికాహారం, పాఠశాలల్లో ఉన్న మౌలిక వసతులు అంశంలో గత పది సంవత్సరాలలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా డైట్ చార్జీలు పెరగకపోవడం వల్ల విద్యార్థులకు పౌష్టికాహారం అందించలేక ఉపాధ్యాయులు చాలా కష్టాలు పడ్డారని , వీటిని గమనించిన ప్రజా ప్రభుత్వం కమిటీ వేసి పెరిగిన ధరలకు అనుగుణంగా 15 రోజులలో నివేదిక తప్పించుకొని 40 శాతం డైట్ చార్జీలు పెంచామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App