విద్యార్థులకు పౌష్టికాహారం అందించేలా కామన్ డైట్ కార్యక్రమం అమలు అదనపు కలెక్టర్ డి.వేణు
*విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మకం కలిగించేలా చర్యలు
*40% డైట్ చార్జీలు, 200% కాస్మెటిక్ చార్జీలను ప్రజా ప్రభుత్వం పెంచింది
*మంథని బీసీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన అదనపు కలెక్టర్
మంథని, డిసెంబర్ 14: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రెసిడెన్షియల్ పాఠశాలలో చదివే విద్యార్థులకు పౌష్టికాహారం అందించే దిశగా ప్రభుత్వం కామన్ డైట్ కార్యక్రమాన్ని లాంచ్ చేసిందని అన్నారు.
శనివారం అదనపు కలెక్టర్ డి.వేణు మంథని నియోజకవర్గం లోని బిసి బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి విద్యా బోధన, వసతి సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పెంచిన మెస్ చార్జీలకు అనుగుణంగా తయారు చేసిన కొత్త డైట్ మెన్యూ ను అదనపు కలెక్టర్ డి.వేణు ప్రారంభించారు.
అదనపు కలెక్టర్ డి.వేణు మాట్లాడుతూ,
ప్రపంచంతో పోటీపడే విద్యార్థులను తయారు చేసేందుకు ప్రజా ప్రభుత్వం దృడ నిశ్చయంతో అడుగులు వేస్తుందని, మంచి పౌష్టికాహారం తీసుకుంటేనే పిల్లల దేహా దారుఢ్యం, మేదస్సు ఎదుగుదల నమోదు అవుతుందని అన్నారు.
ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటూ విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని అన్నారు.
డైట్ చార్జీలను 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు 950 నుంచి 1330 రూపాయలకు, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులకు 1100 నుంచి 1540 రూపాయలకు, ఇంటర్ నుంచి పీజీ విద్యార్థులకు 1500 నుంచి 2100 రూపాయలకు ప్రజా ప్రభుత్వం పెంచిందని, అదేవిధంగా కాస్మెటిక్ చార్జీలను బాలికలకు 7వ తరగతి వరకు 55 నుంచి 175 రూపాయల వరకు, 11 సంవత్సరాల వయస్సు పై గల బాలికలకు 75 నుంచి 275 రూపాయలకు, బాలురు 7వ తరగతి వరకు 62 నుంచి 150 రూపాయల వరకు, 11 సంవత్సరాల వయస్సు పై గల బాలురు 62 నుంచి 200 రూపాయలకు పెంచినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు
వైద్యులతో సంప్రదించి పిల్లల ఆరోగ్యంగా ఎదిగేందుకు అవసరమైన పోషకాలు అందించేలా కామన్ డైట్ కార్యక్రమం అమలు చేస్తున్నామని అన్నారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయిలో సౌకర్యాలు కల్పించేందుకు యంగ్ ఇండియా సమీకృత విద్యాలయాలను ప్రభుత్వం నిర్మిస్తుందని అన్నారు. ప్రజా ప్రభుత్వంలో పిల్లలకు కల్పించే సౌకర్యాలు తల్లిదండ్రులకు తెలియాలనే ఉద్దేశంతో ఈ రోజు వారిని ఆహ్వానిస్తున్నామని అన్నారు.
గురుకులాలకు గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే బిల్లులు చెల్లించేలా చర్యలు చేపట్టామని, ఇక పై నాణ్యతతో కూడిన వస్తువులు మాత్రమే సరఫరా చేయాలని, ఎక్కడ నాణ్యత లోపించిన ఉపేక్షించ కుండా కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. పాఠశాలలో పరిశుభ్రతకు ఎక్కడ లోటు లేకుండా ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇంట్లో తల్లిదండ్రులు పిల్లలను ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో, ఉపాధ్యాయులు అంతే జాగ్రత్తగా చూసుకోవాలని, మన గురుకులాల్లో చదివే పిల్లల పట్ల మనం బాధ్యతతో ఉండాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App