TRINETHRAM NEWS

టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నర్సారెడ్డి భూపతి రెడ్డిని కలిసి వినతి పత్రం ఇచ్చిన సూపర్ మాక్స్ కార్మికులు…

సూపర్ మాక్స్ పరిశ్రమ యాజమాన్యం కంపెనీని లాకౌట్ చేసి దాదాపు 18 నెలలు గడుస్తున్న యాజమాన్యం తమ గోడును పట్టించుకోవడం లేదని కార్మికులు మంగళవారం రోజున కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతి రెడ్డి గారిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నర్సారెడ్డి భూపతి రెడ్డి మాట్లాడుతూ సూపర్ మాక్స్ కంపెనీ కార్మికుల సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి, జిల్లా ఇంచార్జ్ మంత్రులు ఐ. టి పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ గత 18 నెలలుగా 1000 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. 12 నెలల నుండి తాము రిలే నిరాహార దీక్షలు చేపట్టినప్పటికీ తమను పట్టించుకున్న పాపను పోవట్లేదని వాపోయారు. ఈ సందర్భంగా ఈరోజు దీక్షలో కూర్చున్న రంగన్న,రామకృష్ణ రెడ్డి గార్లకు కార్మికులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు..