తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో జిల్లాస్థాయి విజ్ఞాన ప్రదర్శన
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
విజ్ఞాన ప్రదర్శనకు ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ తో పాటు పాల్గొన్న వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతిక్ జైన్, ట్రైన్ కలెక్టర్ ఉమా హారతి, ఆర్డీవో వాసు చంద్ర, డీఈవో రేణుకాదేవి, డి ఎస్ ఓ విశ్వేశ్వర్, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షులు బి ఎన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్, పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు వేణుగోపాల్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి, నాయకులు సత్యం సెట్, కిషన్ నాయక్, అనంత్ రెడ్డి, చెగులపల్లి రమేష్ కుమార్, సర్పరాజ్, సతీష్, రెడ్యానాయక్ తదితరులు. విజ్ఞాన ప్రదర్శనలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతులు, ప్రశంస పత్రాలను అందజేసిన స్పీకర్
ఈ విజ్ఞాన ప్రదర్శనను ఉద్దేశించి స్పీకర్ మాట్లాడుతూ జిల్లా విద్యా శాఖ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సైన్స్ ఫేర్ కార్యక్రమంలో పాల్గొంటున్న విద్యార్ధినివిద్యార్ధులకు, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు.
విద్యార్థులలోని సృజనాత్మకతను వెలికితీయడానికి సైన్స్ ఫేర్ఉపయోగపడుతుంది.ఆధునిక కాలంలో సైన్స్, టెక్నాలజీ అనేవి మనుషుల,జీవితాలలో,భాగం,అయ్యాయి.రోజు మనం ఉపయోగిస్తున్న, వాడుతున్న ప్రతి వస్తువు పరిశోధనల ద్వారా ఆవిష్కరించినవి. విద్యార్థులు వినూత్నంగా ఆలోచనలు చేయాలి. అప్పుడే గుర్తింపు వస్తుంది. న్యూటన్, ఐనిస్టిన్, సివి రామన్ ఇలా డిఫరెంట్ గా ఆలోచనలు చేసి గొప్ప శాస్త్రవేత్తలు అయ్యారు.
ఆవిష్కరణ లకు అంతం లేదు, ప్రస్తుతంవాడుతున్న వాటికంటే ఇంకా ఆధునిక, సౌకర్యవంతమైన వస్తువులు వస్తే వాటికి డిమాండ్ ఉంటుంది.కార్లు, కంప్యూటర్లు, ఫోన్, ఇంటర్నెట్, విమానాలు, రాకెట్లు ఎన్ని మార్పులు వచ్చాయి, ప్రతి సంవత్సరంమొదట బ్లాక్ and వైట్ టీవీ స్థానంలో కలర్ టీవీ లు వచ్చాయి,ఇప్పుడు ప్లాస్మా టీవీ లు, వాల్ పేపర్ టీవీలు,వస్తున్నాయి. గతంలో ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది, తర్వాత కీ పాడ్ ఫోన్, ఇప్పుడు స్మార్ట్ ఫోన్,భవిష్యత్తులో ఇంకా ఎంత ఆధునికంఅవుతుందో చూడాలి.
మీరు కూడా ప్రస్తుతం కాకుండా ముందు ముందు ఎలా ఉండాలి, ఎలాంటివస్తువులు ప్రజలకు ఉపయోగపడుతాయని,ఆలోచించాలి. అవి ఇప్పటి కన్నా మెరుగ్గా ఉండాలి.ఈ భూమి మీద మనుషులే కాదు జంతువులు,పక్షులు, జలచరాలు, చెట్లు అన్ని ఉన్నాయి.ప్రస్తుతం కాలుష్యంతో వాతావరణం దెబ్బతింటుంది.కాలుష్యాన్ని కంట్రోల్ ఎలా చేయాలి అని మీరు కూడా ఆలోచనచేయాలి, పరిశోధనలు చేయాలి,పరిష్కారం కనిపెట్టాలి.
వ్యవసాయ రంగంలో తక్కువ నీటితో పంటలు ఎలా పండించాలి, రైతులకు మంచి దిగుబడులు వచ్చే విదంగాపరిశోధనలు చేయాలి, రైతులకు మేలు చేయాలి.మీరు కూడా మంచిగా చదువుకుని, మంచి సైంటిస్టులు కావాలని,అందరికీ ఉపయోగపడే మంచి ఆవిష్కరణలు చేయాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App