TRINETHRAM NEWS

పొరపాట్లు లేకుండా పక్కాగా గ్రూప్ 2 పరీక్షలు నిర్వహించాలి గ్రూప్ 2 పరీక్షల జిల్లా నోడల్ అధికారి జే.అరుణ శ్రీ

*డిసెంబర్ 15, 16న రెండు సెషన్స్ లలో గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ

*పరీక్ష సమయం ముగిసే వరకు హాల్ విడిచి ఎవరూ బయటికి వెళ్ళవద్దు

*9 వేల 18 మంది అభ్యర్థులు పరీక్షలు రాసేందుకు జిల్లాలో 18 పరీక్షా కేంద్రాలు సిద్ధం

*గ్రూప్ 2 పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన అదనపు కలెక్టర్లు

పెద్దపల్లి, డిసెంబర్ 12: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లాలో ఎటువంటి పొరపాట్లు లేకుండా పక్కాగా గ్రూప్ 2 పరీక్షల నిర్వహించాలని గ్రూప్ 2 పరీక్షల జిల్లా నోడల్ అధికారి జే.అరుణ అధికారులకు సూచించారు.

బుధవారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డి.వేణు తో కలిసి గ్రూప్ -2 పరీక్షా ఏర్పాట్ల పై గ్రూప్ 2 పరీక్షల జిల్లా నోడల్ అధికారి జే.అరుణ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

గ్రూప్ 2 పరీక్షల జిల్లా నోడల్ అధికారి జే.అరుణ మాట్లాడుతూ, షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 15, 16 తేదీలలో ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 వరకు రెండు సెషన్ లలో గ్రూప్ 2 పరీక్షలు సజావుగా జరిపేందుకు ఏర్పాట్లు పక్కాగా జరగాలని అధికారులకు అదనపు కలెక్టర్ సూచించారు.

మన జిల్లాలో 9 వేల 18 మంది అభ్యర్థులు గ్రూప్ 2 పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా మొత్తం 18 పరీక్ష కేంద్రాలు సిద్ధం చేశామని అన్నారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని ట్రెజరీ స్ట్రాంగ్ రూమ్ వద్ద ప్రశ్న పత్రాల స్టోరేజ్ గా పనిచేస్తుందని తెలిపారు. జిల్లాలో పరీక్షల సక్రమంగా నిర్వహించేందుకు 18 పరీక్ష కేంద్రాలకు రీజనల్ కోఆర్డినేటర్ గా లక్ష్మీ నర్సయ్యను నియమించడం జరిగిందని అన్నారు.

ప్రశ్న పత్రాలను పరీక్ష కేంద్రాలకు తరలించేందుకు వీలుగా నాయబ్ తహసిల్దార్ లను 6 జాయింట్ రూట్ అధికారులుగా పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసేందుకు తహసీల్దారులను ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులుగా నియమించామని అన్నారు.

ప్రశ్న పత్రాల భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ వద్ద అవసరమైన జాగ్రత్తలు పాటించాలని అన్నారు. డిసెంబర్ 14న పరీక్షల నిర్వహణ పై పరీక్ష కేంద్రాల వారిగా చీఫ్ సూపరింటెండెంట్, ఇన్విజిలేటర్ లు సమావేశాలు నిర్వహించుకోవాలని అదనపు కలెక్టర్ సూచించారు. ఒకరోజు ముందు పరీక్ష కేంద్రం పరిసరాలను చీఫ్ ఇన్విజిలేటర్ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

పరీక్షా కేంద్రం కాంపౌండ్ వాల్ దగ్గర కిటికీలు, చెట్లు ఏవైనా ఉన్నాయా పరిశీలించాలని , ఎట్టి పరిస్థితులలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం ఉండకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాల గేటు వద్ద ఒక గడియారం ఏర్పాటు చేయాలని అన్నారు.

పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులను ఉదయం సెషన్ లో 8.30 నుంచి, మధ్యాహ్నం సెషన్ లో 1.30 నుంచి అనుమతించడం జరుగుతుందని, పరీక్ష కేంద్రాల గేటు ఉదయం 9.30 గంటలకు, మధ్యాహ్నం 2.30 గంటలకు మూసి వేస్తామని, దీని తర్వాత పరీక్ష కేంద్రాలకు ఎవరిని అనుమతించడం జరగదని, ఈ అంశాన్ని అభ్యర్థులకు చేరేలా విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు.

పరీక్షలు ప్రారంభమైన తర్వాత పరీక్ష కేంద్రాన్ని వదిలి ఎవరూ వెళ్ళకూడదని అన్నారు. గ్రూప్ పరీక్షల నిర్వహణకు ఎంపిక చేసిన పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి అక్కడ అవసరమైన మౌలిక వసతులు ఉండేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు వచ్చే సమయంలో చెక్ చేసేందుకు అవసరమైన స్టాఫ్ ఏర్పాటు చేయాలని, మహిళా అభ్యర్థులను చెక్ చేసేందుకు ప్రైవసీ ఉండేవిధంగా ఏర్పాటు చేయాలని, అభ్యర్థులను చెక్ చేసే సిబ్బందికి శిక్షణ అందించాలని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలో హల్ నెంబర్లకు మార్గం తెలిసేలా డైరెక్షన్స్ ఏర్పాటు చేయాలని అన్నారు.

పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు ఒకరోజు ముందు వెళ్లి చెక్ చేసేలా ప్రచారం చేయాలని , పరీక్ష కేంద్రాలకు అభ్యర్థులు క్యాలిక్యులేటర్, సెల్ఫోన్ పెన్ డ్రైవ్ ,బ్లూ టూత్ డివైసెస్, జువెలరీ, ఎలక్ట్రానిక్ గాడ్జెట్ మొదలగు సామాగ్రి తీసుకుని రావడానికి వీల్లేదని , చెప్పులు మాత్రమే వేసుకుని రావాలని షూస్ వేసుకోవద్దని, అభ్యర్థుల బయోమెట్రిక్ వెరిఫై చేయాలని అన్నారు.

అభ్యర్థుల వివరాలతో కూడిన ఓఎంఆర్ షీట్లు వచ్చాయని, వాటిని సరైన అభ్యర్థులకు అందేలా చూడాలని అన్నారు. గ్రూప్ 2 పరీక్షల ప్రశ్న పత్రాలను అభ్యర్థులకు ఉదయం 9.55, మధ్యాహ్నం 2.55 అందించాలని అన్నారు. పరీక్ష సమయం ముగిసిన తర్వాత పెన్ డౌన్ బెల్ మోగుతుందని, దాని తర్వాత ఏమి రాసిన అనుమతించవద్దని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు.

ఎస్కార్ట్ లేకుండా ప్రశ్నాపత్రాలు వస్తే పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ తీసుకోవద్దని కలెక్టర్ తెలిపారు. పోలీస్ బందోబస్తు తోనే ప్రశ్నా పత్రాల తరలింపు ఉండాలని అదనపు కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ఈ సమావేశంలో అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రతాప్, రీజనల్ కోఆర్డినేటర్ లక్ష్మీ నరసయ్య, కలెక్టరేట్ సూపరింటెండెంట్ ప్రకాష్, అబ్జర్వర్లు ఫ్లయింగ్ స్క్వాడ్, చీఫ్ సూపరింటెండెంట్ లు , తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App