TRINETHRAM NEWS

నా ఆత్మీయుల అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను విజయలక్ష్మి కి నిర్మించే నూతన ఇల్లు నిర్మాణం కోసం సహకరించాలని మడిపెల్లి మల్లేష్ విజ్ఞప్తి

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం కార్పొరేషన్ పరిధిలోని రెండోవ డివిజన్ ఇందిరమ్మ కాలనీకి చెందిన విజయలక్ష్మి అనే నిరుపేద మహిళ భర్త నుండి దూరమై 13సంవత్సరాల కొడుకుతో కలసి ఇందిరమ్మ కాలనీలో చిన్న పూరిగుడిసెలో నివాసం ఉంటు కూలి పనులు చేసుకుంటూ ఉంటుంది బుధవారం రోజున ఆ పూరి గుడిసె ప్రమాదంశాత్తు పూర్తిగా దగ్ధంమైన విషయం తెలిసిందే
తినడానికి కూడా ఏం లేకుండ మంటలో బియ్యం నిత్యావసర సరుకులు పూర్తిగా కాలిపోవడంతో సేవా స్ఫూర్తి ఫౌండేషన్ సభ్యులందరి సహకారంతో బుధవారం రోజున 25 కిలో బియ్యం నిత్యవసర సరుకులు మరియు కూరగాయలు, మా ఆత్మీయులు అబ్బాస్ సహకారంతో చిన్న గ్యాస్ పోయి ఇవ్వడం జరిగిందని ప్రస్తుతానికి తల్లి కొడుకును ఇంటి దగ్గర్లో ఒక ఇంట్లో ఉండటానికి ఆశ్రయం కల్పించామని మల్లేష్ తెలిపారు విజయలక్ష్మి కి చెందిన కట్టు బట్టలు చెద్దర్లు గంజులు పల్లాలు పూర్తిగా మంటల్లో కలిపోయాయని రామగుండం లోని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు ముందుకు వచ్చి మికు తోచిన సహాయం అందించాలని మడిపెల్లి మల్లేష్ కోరారు సేవ స్ఫూర్తి ఫౌండేషన్ ఆత్మీయుల సహకారంతో
ఈ అమ్మకు నూతన ఇల్లు నిర్మాణం చేయడానికి ఆలోచన చేశామని ఎవరైనా దాతలు సహాయం చేయాలనుకుంటే దయచేసి నాకు సహకరించగలరని మల్లేష్ తెలిపారు గతంలో కూడా నాఆత్మీయులందరి సహకారంతో రెండు నూతన గృహలు నిర్మాణం చేసిన సంగతి తెలిసిందే ఈనూతన గృహానికి కూడా మి వంతుగా సహాయం అందించాలని బాధితురాలు విజయలక్ష్మి తరుపున మరియు సేవా స్ఫూర్తి ఫౌండేషన్ తరపున చేతులు జోడించి వేడుకుంటున్నానని సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపెల్లి మల్లేష్ అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App