మధురపూడి నుండి ఢిల్లీ కి విమాన సర్వీస్ ప్రారంభం
ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బత్తుల
Trinethram News : Andhra Pradesh : మధురపూడి విమానాశ్రయం నుంచి మొదటి సారిగా దేశ రాజధాని ఢిల్లీకి ఎయిర్ బస్ సేవలు గురువారం నుంచి ప్రాంభమయ్యాయి…ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ, రాజమహేంద్రవరం ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, జగ్గంపేట నియోజకవర్గం శాసన సభ్యులు జ్యోతుల నెహ్రు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి, జనసేన పార్టీ యువ నాయకులు తోట పవన్ కుమార్, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన పలువురు నాయకులు పాల్గొన్నారు..
ఈ సర్వీస్ ఉదయం 6:30 గం లకు ఢిల్లీ నుంచి బయలుదేరి ఉదయం 8:45 గంటలకు మధురపూడి విమానాశ్రయానికి చేరుకుంటుందని విమానాశ్రయం డైరెక్టర్ ఎస్.జ్ఞానేశ్వరరావు తెలిపారు..
ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం బిజెపి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App