TRINETHRAM NEWS

కాంగ్రెస్ తల్లి వద్దు తెలంగాణ తల్లి ముద్దు

ప్రజల మనోభావాలు దెబ్బ తిన్నాయి

తెలంగాణ తల్లి విగ్రహానికి పాలభిషేకం చేస్తున్న డిప్యూటీ మేయర్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు

Trinethram News : Medchal : కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహానికి చేసిన అపచారానికి నిరసనగా బుధవారం నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో నిజాంపేట్ రాజీవ్ గృహకల్ప లో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్ గార్ల ఆధ్వర్యంలో నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, సీనియర్ మహిళా నాయకులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని తప్పుపట్టారు. వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహం కాంగ్రెస్ తల్లి విగ్రహం మాదిరీ ఉందని, శుభ సూచకంగా కుడి కాలు ముందు ఉండాల్సి ఉండగా,ఈ విగ్రహానికి ఎడమ కాలు ముందు పెట్టారు, సోనియా గాంధీ మెప్పు పొందాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహాన్ని మార్చారని తెలిపారు. విగ్రహాన్ని మార్పు ప్రజల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బాలాజీ నాయక్, గాజుల సుజాత, సీనియర్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు,బిఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్, మహిళా నాయకులు, యువ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App