సి.ఎం.ఆర్.ఎఫ్ ద్వారా నిలుస్తున్న నిరుపేదల ప్రాణాలు – ఎమ్మెల్యే కె.పి.వివేకానంద.
రూ.2.10 లక్షల విలువగల ఎల్.ఓ.సి. చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే…
Trinethram News : Medchal : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బతుకమ్మ బండ బస్తీకి చెందిన బి. కృష్ణ గారి అబ్బాయి ప్రణవ్ ఇటీవలే అనారోగ్యంతో బాధపడుతూ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. కాగా పెరుగుదల హార్మోన్ ( గ్రోత్ హార్మోన్) ఇంజెక్షన్ కొరకు డబ్బులు లేఖ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవడంతో ఎమ్మెల్యే కే.పీ.వివేకానంద్ గారిని ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు సదరుకుటుంబానికి భరోసానిచ్చారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకం కింద దరఖాస్తు చేయించి ప్రభుత్వం ద్వారా రూ.2.10 లక్షలు మంజూరు చేయించారు. సంబంధిత చెక్కును ఈ రోజు ఎమ్మెల్యే గారు తన నివాస కార్యాలయములో వారికి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App