కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ జన్మదిన వేడుకలు గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో సోమవారం కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి కార్యకర్తలకు, ప్రజలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ కొలిపాక సుజాత, నాయకులు దిటి బాలరాజు, గట్ల రమేష్, హాజరై సోనియా గాంధీ జన్మదిన కేకును వారి చేతుల మీద కట్ చేసి జన్మదిన వేడుకల్లో ఘనంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ తెలంగాణకు దేవత అని కొనియాడారు. తెలంగాణ సాధన కోసం జరుగుతున్న పోరాటంలో అనేక మంది త్యాగాలు, ప్రాణ త్యాగాలు గమనించి, చలించిపోయి, తెలంగాణ రాష్ట్రం ఇస్తానని ప్రకటించి, ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చి మాట నిలబెట్టుకున్న దేవత అని తెలిపారు. ఆమెకు ప్రధాన మంత్రి పదవి అవకాశం వచ్చినా పదవి త్యాగం చేసి ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్ కు అవకాశం ఇచ్చి గొప్ప నేత్రి సోనియా గాంధీ అని అన్నారు.
గత సంవత్సరం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీ పథకాల హామి నెరవేర్చడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, దాని అనుబంధ సంఘాల నాయకులు ఎండి ముస్తఫా, సుతారి లక్ష్మన్ బాబు, నాయిని ఓదెలు, కొప్పుల శంకర్, బొమ్మక రాజేష్, రాచకొండా కోటేష్, తాళ్లపెల్లి యుగేందర్, సాంబ మూర్తి, దూళికట్ట సతీష్, కౌటమ్ సతీష్, ఆడెపు రవి, సన్నీ, గడ్డం శేఖర్, పంజా శ్రీనివాస్, బొంతల లచ్చన్న, మీసాల సతీష్, రాజి రెడ్డి, భూషణ్, ఇండ్ల ఓదెలు, కుంట సది, పరుపాక శంకర్, మద్దెల శ్రీనివాస్, చొప్పరి శ్రీనివాస్, రాము, తిరుపతి రెడ్డి, బెండ్రెమ్ రాజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, గడ్డం సతీష్, అరిఫ్, రామ స్వామి, అశోక్ లతోపాటు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App