1 కోటి 31 లక్ష 97 వేల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు..
అభివృద్ధి విషయంలో రాజిపడేది లేదు..
ప్రజా పాలనలో పెద్దపల్లి పట్టణ సుందరీకరణకు మోక్షం..
శరవేగంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు..
పట్టణ ప్రజలందరికీ మంచినీటి సమస్య లేకుండా చేస్తాం..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో పెద్దపల్లి మున్సిపాలిటీ కి అదనంగా 15 కోట్లు మంజూరు
చింతకుంట విజయరమణ రావు
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
పెద్దపల్లి పట్టణంలోని 26,27,28 వార్డులల్లో ప్యాకేజి-9 ద్వారా తుఫిడీసీ నిధులు 1 కోటి 31 లక్షల 97 వేల రూపాయలతో నూతనంగా నిర్మాణాలు చేపట్టే సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ, కల్వర్ట్ ల నిర్మాణాలకు కౌన్సిలర్లతో మరియు నాయకులతో కలిసి శంకుస్థాపనలు చేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు
ముందుగా పలు వార్డుల ప్రజలు, నాయకులు గజమాలలతో, శాలువాలతో ఘనంగా సత్కరించారు
ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, పలు వార్డుల ప్రజలు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App