ఎస్సీ వర్గీకరణ కోసం ఎస్సీ కుల సంఘాలు సూచనలు ఇవ్వాలి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ఎస్సి వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య విచారణ కమిషన్ చైర్మన్ డా. జస్టిస్ షమీమ్ అఖ్తర్ ఈ నెల 10 వ తేది ఉదయం 10: గం లకు ఉప వర్గీకరణపై బహిరంగ విచారణ మరియు వివరణాత్మక అధ్యయనం కోసం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం కొంగరకలాన్ రావడం జరుగుతుందని జిల్లా షెడ్యుల్డ్ కులాల అభివృద్ధి శాఖ అధికారి యన్ మల్లేశం శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కావున వికారాబాద్ జిల్లాకు కి చెందిన ఎస్సి సంఘ నాయకులూ, మేధావులు మరియు పార్టీ నాయకులూ ఎస్సి ఉప కులాల వర్గీకరణ పై తమ యొక్క అభిపాయాలను ఎస్సి వర్గీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏక సభ్య విచారణ కమిషన్ కి అందజేయాలని తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App