ట్రాక్టర్ క్రేజ్ వీల్స్ వినియోగిస్తే వాహనాల సీజ్ జిల్లా కలెక్టర్ కోయ హర్ష
*మొదటి సారి పట్టుపడితే వేయి రూపాయల జరిమానా, రెండవసారి వాహనం సీజ్
*క్రేజ్ వీల్స్ వినియోగం వల్ల రోడ్లకు నష్టం వాటిల్లుతుంది
పెద్దపల్లి, డిసెంబర్ -07: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ట్రాక్టర్ క్రేజ్ వీల్స్ వినియోగిస్తే వాహనాల సీజ్ చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
వరి నాట్లు వేసే సీజన్ నేపథ్యంలో ట్రాక్టర్ వాహనాలను రోడ్ల పై క్రేజ్ వీల్స్ తో నడుపడం వల్ల రోడ్లు నష్టానికి గురవుతున్నాయని , రోడ్ల పై క్రేజ్ వీల్స్ తో ట్రాక్టర్ నడపడం మొదటిసారి గమనిస్తే 1000 రూపాయల జరిమానా, రెండవసారి గమనిస్తే వాహనం సీజ్ చేయడం జరుగుతుందని, క్రేజ్ వీల్స్ తో ట్రాక్టర్ రోడ్ల పై నడుపవద్దని కలెక్టర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, పెద్దపల్లిచే జారీ చేయనైనది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App