గ్రామీణ అవగాహన కృషి అనుభవ కార్యక్రమం.
పెనుమూరు మండలం. పెనుమూరు మేజర్ న్యూస్ త్రినేత్రం.
ఈ అవగాహన సదస్సులో భాగంగా ఈరోజు అట్లవారి పల్లె గ్రామం నందు రైతు సదస్సు తిరుపతి ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ బి సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి విభాగం అధిపతి వై.వి సుమతి పాల్గొన్నారు.ఆమె రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ పంటలను సాంకేతిక పద్ధతిలో సాగు చేసిన,రైతులకు సాగు ఖర్చు మరియు అధిక దిగుబడులు పొందవచ్చు అని సూచించారు.ఈ కార్యక్రమంలో తిరుపతి వ్యవసాయ కళాశాల నుండి డాక్టర్ వై రెడ్డి రాము పాల్గొన్నారు.ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల నుండి విద్యార్థులు మీ గ్రామంలో ఉంటూ ప్రతిరోజు మీతో మమేకమై మీరు వివిధ పంటలలో అవలంబించే పద్ధతులు పరిశీలించి, దానికి వారు చదువుకున్న సాంకేతిక పద్ధతులను మీ రైతులకు వివరించడం జరిగింది. డాక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ వరి, వేరుశనగలో వేసుకోవలసిన ఎరువుల గురించి రైతులకువివరించారు.ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు దేవకీ,నాగమణి గ్రామ వ్యవసాయ అధికారులు ఢిల్లీ బాబు,తులసి మరియు గ్రామ సర్పంచ్ దూది వెంకటేశులు,గ్రామస్తులు చంద్రశేఖర్, ఢిల్లీ బాబు, చిన్న బ్బరెడ్డి,లక్ష్మయ్య,పవన్, లావణ్య కుమార్ మొదలగు వారు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App