వికారాబాద్ జిల్లాలో నరాల గుండె వైద్య చికిత్స ఆస్పత్రి ప్రారంభించిన
తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్
వికారాబాద్ జిల్లా ప్రతినిధి పాల త్రినేత్రం న్యూస్
వికారాబాద్ జిల్లా కేంద్రంలో నరాల గుండె వైద్య చికిత్స ఆస్పత్రిని ప్రారంభించిన తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఆయన మాట్లాడుతూ,రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఉన్నారు.గ్రామీణ ప్రాంతవాసులు రైతులు ఎక్కువ మంది వస్తు ఉంటారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో ఆదిత్య న్యూరో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభించారు. ఆస్పత్రి వ్యవస్థాపకులు డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, డాక్టర్ భావన రెడ్డి, ఆధ్వర్యంలో శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిమేనేజర్ కొత్తపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ, నరాలకు సంబంధించినవి వ్యాధి పక్షవాతం,మూతి వంకర, వెన్నునొప్పి,తలనొప్పి, నడుము నొప్పులు తలనొప్పి ఒకవైపు మెదడులో గడ్డలు చీము క్షయ వ్యాధి మెదడులో రక్తం గడ్డ కట్టడం ఆలోచన శక్తి తగ్గడం, వినికిడి సమస్యలు తగ్గించడం వంటి రోగాలకు చాతి నొప్పి శ్వాస ఆడక పోవడం చాతిలో ఒత్తిడి అనుభూతి కాళ్లు లేదా చేతులు తిమ్మిరి, తెల్లదనం మైకం లేదా మోర్చా చర్మం నీలిరంగు రంగులోకి మారడం వాళ్ళ చుట్టూ వాపు చేతిలో నొప్పి శ్వాస ఆడక పోవడం వంటి చికిత్స చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, మున్సిపల్ మాజీవై చైర్మన్ రమేష్, వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, కౌన్సిలర్లు మురళి,గోవర్ధన్ రెడ్డి, లక్ష్మణ్, సర్పరాజ్, శ్రీనివాస్ ముదిరాజ్, హాస్పిటల్ యజమాన్యం తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App