టాటా ఏసీ ఆటో ట్రాలీ వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 25 క్వింటాళ్ళ పిడిఎస్ రైస్ పట్టుకున్న పెద్దపల్లి టాస్క్ ఫోర్స్ పోలీసులు.
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం పోలీస్ కమీషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోదావరిఖని నుండి పిడియస్ రైస్ అక్రమ రవాణా చేస్తున్నారనే నమ్మదగిన సమాచారం మేరకు పెద్దపల్లి టాస్క్ ఫోర్సు సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో, ఎస్ఐ రాజేష్ మరియు టాస్క్ ఫోర్సు సిబ్బంది నిన్న రాత్రి సమయం లో గంగా నగర్ వద్ద గోదావరిఖని నుండి వస్తున్క టాటా ఏసీ ట్రాలీ నెంబర్ AP 15 TA 8728 లో అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటల్ల పిడిఎస్ రైస్ ని పట్టుకోవడం జరిగింది . పట్టుకున్న నిందితున్ని పిడిఎస్ రైస్ ని ఎక్కడికి తీసుకెళుతున్నావు అని విచారించగా మహారాష్ట్రకు తీసుకెళుతున్నానని నిందితుడు తెలిపినాడు.
నిందితుడి వివరాలు
1) తింగళూనాంజిడప్ప దర్శన్ S/o రాము వయస్సు 21 కులం SC మాదిగ Occ:ఆటో డ్రైవర్ R/o ఎన్టీఆర్ నగర్ మంచిర్యాల.
పిడిఎస్ రైస్ 25 క్వింటాళ్ళు,టాటా ఏసీ ట్రాలీ నెంబర్ AP 15 TA 8728 స్వాధీనం
తదుపరి విచారణ నిమిత్తం స్వాదినపరుచుకున్న 25 క్వింటాళ్ల పిడిఎస్ రైస్, టాటా ఏసీ ట్రాలీ ఆటోను మరియు నిందితుడిని గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App