ఎన్టీఆర్ జలాసయం గేట్లు ఎత్తివేత
త్రినేత్రం న్యూస్ జీడీ నెల్లూరు నియోజకవర్గ o. పెనుమూరు మండలం పెనుమూరు ఇంచార్జ్. పెంగల్ తుఫాన్ కారణంగా రెండు రోజులుగా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది. దాని ప్రభావం వల్ల శనివారం కురిసిన భారీ వర్షంతో పెనుమూరు మండలం కల్వకుంట పంచాయతీ లో ఉన్న ఎన్టీఆర్ జలాశయానికి భారీగా వరద నీరు రావడం జరిగింది. దీంతో అధికారులు అప్రమత్తమై రెండు గేట్లు తెరిచి 1500 క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేశారు. జలాశయం పరిసర గ్రామాల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్లకు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App