అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు
సినీహీరో అల్లు అర్జున్ పై ఓ వ్యక్తి జవహర్ నగర్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
అల్లు అర్జున్ తన అభిమాన సంఘానికి అర్జున్ ఆర్మీ అని పేరు పెట్టుకున్నాడని.. ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరని, దీనిని అభిమాన సంఘానికి పెట్టుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్ ఫిర్యాదు చేశాడు.
ఆర్మీ అంటే జాతీయ సమగ్రత, దేశ భద్రతకు సంబంధించిన అంశమని, అల్లు అర్జున్ మాత్రం.. ఇవేవీ పట్టించుకోకుండా పలు వేది కలపై తనకు ఆర్మీ ఉందని ప్రకటించాడని పేర్కొన్నారు.. అర్జున్ పై కేసు నమోదు చేయాలని కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App