భోజనంలో పురుగులు రావడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్

TRINETHRAM NEWS

భోజనంలో పురుగులు రావడంపై ఏపీ ప్రభుత్వం సీరియస్..

అమరావతి:గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో భోజనంలో పురుగులు రావడంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. బాధ్యుడైన హాస్టల్ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది..

దీంతో శుక్రవారం అర్ధరాత్రి నుంచి వారు ఆందోళనకు దిగారు. వర్సిటీలోని మహిళా హాస్టల్‌ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి వెళ్లి వీసీ చాంబర్‌ ఎదుట బైఠాయించి పెద్దఎత్తున నినాదాలు చేశారు. భోజనం ఇలా ఉంటే ఎలా తినాలంటూ ప్రశ్నించారు. వందలాది మంది విద్యార్థినులు నిన్న రాత్రి 9 గంటల నుంచి ఇవాళ తెల్లవారుజాము వరకూ ఆందోళన కొనసాగించారు. విషయం ఏపీ ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో విచారణకు ఆదేశించింది. విచారణ నివేదికను వెంటనే ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top