TRINETHRAM NEWS

మండలిలో బీఆర్‌ఎస్‌దే బలం
40లో 28 మంది గులాబీలే- కాంగ్రెస్‌కు ఉన్నది ఒక్కరే
ఆరు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ

రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో శాసనమండలిలో ఎవరి బలం ఎంత? అనే అంశంపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతున్నది. మండలిలో మొత్తం 40 స్థానాలు ఉండగా ఇం దులో బీఆర్‌ఎస్‌ నుంచి 28 మంది, ఎంఐ ఎం నుంచి ఇద్దరు, కాంగ్రెస్‌ నుంచి ఒక్కరు, బీజేపీ నుంచి ఒక్కరు, మరో ఇద్దరు స్వతం త్య్ర ఎమ్మెల్సీలు ఉన్నారు. ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో గవర్నర్‌ కోటాలో రెండు, ఎమ్మెల్యే కోటాలో రెండు, స్థానిక సంస్థల కోటాలో ఒకటి, పట్టభద్రుల కోటాలో ఒకటి చొప్పున ఖాళీలు ఉన్నాయి. ఎమ్మెల్సీలుగా ఉంటూ శాసనసభకు నలుగురు పోటీచేశారు. బీఆర్‌ఎస్‌ నుంచి కడియం శ్రీహరి, పాడి కౌశిక్‌రెడ్డి (ఎమ్మెల్యేల కోటా), పల్లా రాజేశ్వర్‌రెడ్డి (నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గం), కాంగ్రెస్‌ నుంచి కసిరెడ్డి నారాయణరెడ్డి (మహబూబ్‌నగర్‌ స్థానిక సంస్థల కోటా) ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ఈ నలుగురు ఎమ్మెల్సీ పదవులకు రాజీనామా చేయగా మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి వాటిని ఆమోదించారు.

శాసనమండలిలో వివిధ పార్టీల బలాబలాలు
ఎమ్మెల్యే