WhatsApp Image 2024 11 18 at 2.14.07 PM
హజ్రత్ అలీ మరణం బిఆర్ఎస్ పార్టీకి తీరనిలోటు : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
Trinethram News : Medchal : నిన్న సాయంత్రం 126 – జగద్గిరిగుట్ట డివిజన్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు హజరత్ అలీ జ్ఞాపకార్థం నిర్వహించిన “ఫతేహా చెహ్లుం” సంతాప సభ కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను నిత్యం ప్రజా ప్రతినిధుల దృష్టికి తెచ్చి సమస్యల పరిష్కారంలో నిరంతరం పోరాడిన సీనియర్ నాయకులు హజరత్ అలీ మరణం వారి కుటుంబ సభ్యులకే కాదు బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటు. బిఆర్ఎస్ పార్టీ వారి కుటుంబ సభ్యులకు ఎప్పుడూ అండగా ఉంటుంది. ఈ సందర్భంగా హజరత్ అలీ జ్ఞాపకార్థం కురాన్ లోని పవిత్ర ప్రవచనాలను ముద్రిస్తూ రూపొందించిన పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో వేణు యాదవ్, జై హింద్, సయ్యద్ రషీద్, పాషా భాయ్, సల్మాన్, షేఖ్ ఖాదర్, చంద్రశేఖర్, యాదగిరి,
సయ్యద్ ముంతాజ్ అలీ, సయ్యద్ ఇంతియాజ్, సయ్యద్ ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
