జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 18 at 19.36.20

TRINETHRAM NEWS

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-3 పరీక్షలు జిల్లా కలెక్టర్ కోయ హర్ష

*రెండవ రోజు 4514 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు

*పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

పెద్దపల్లి, నవంబర్ -18:- త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ కోయ హర్ష అన్నారు.

సోమవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సుల్తానాబాద్ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలలో జరుగుతున్న గ్రూప్ 3 పరీక్షలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ హర్ష మాట్లాడుతూ, పెద్దపెల్లి జిల్లాలో మొత్తం 8 వేల 947 మంది అభ్యర్థులకు 18 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా ఆదివారం ఉదయం జరిగిన మొదటి పేపర్ పరీక్షకు 4557 మంది అభ్యర్థులు హాజరు కాగా, 4390 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, మధ్యాహ్నం జరిగిన పరీక్షకు 4440 మంది అభ్యర్థులు హాజరు కాగా, 4507 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారని, సోమవారం ఉదయం మూడో పేపరు పరీక్షకు 4514 మంది అభ్యర్థులు హాజరు కాగా, 4433 మంది అభ్యర్థులు గైరహాజరయ్యారని జిల్లాలో గ్రూప్ 3 పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని కలెక్టర్ తెలిపారు.

ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page