జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 18 at 14.53.14

TRINETHRAM NEWS

రెండోవ రోజు గ్రూప్-III పరీక్షా కేంద్రాలను పరిశీలించిన పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపీఎస్

కమీషనరేట్ 66 కేంద్రాల్లో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న గ్రూప్-3 పరీక్ష.

పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది

సెక్షన్163 BNSS (144సెక్షన్)అమలు.

త్రినేత్రం న్యూస్ రామగుండం ప్రతినిధి

రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ ఐపిఎస్., ఐజి పెద్దపల్లి జోన్ పరిధిలోనీ సేంట్ క్లియర్ స్కూల్, ఏన్టీపీసీ, గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మంచిర్యాల జోన్ పరిధిలోని సిసిసి నస్పూర్ సింగరేణి కాలరీస్ ఉన్నత పాఠశాల, ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరియు మంచిర్యాల పట్టణం లోని ర్భావ్ స్కూల్, తదితర పరీక్ష కేంద్రాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్ష కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్ల గురించి, పరీక్ష అనంతరం ఎగ్జామ్స్ షీట్స్ స్ట్రాంగ్ రూమ్ తరలింపు గురించి పోలీస్ అధికారులకు సిబ్బందికి తగు సూచనలు, సలహాలు చేశారు. ప్రతి పరీక్షా కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల డీసీపీ భాస్కర్ ఐపిఎస్., గ్రూప్ III ఎగ్జామ్ పోలీస్ నోడల్ అధికారి అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, గోదావరిఖని ఏసీపీ ఎం. రమేష్, మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, ఏ ఆర్ ఏసీపీ సుందర్ రావు, రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, గోదావరిఖని 1 టౌన్ ఇన్స్పెక ర్భావ్ ఇంద్రసేన రెడ్డి, మంచిర్యాల రూరల్ సీఐ అశోక్, మంచిర్యాల పట్టణ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్, తదితరులు, పోలీస్ సిబ్బంది ఉన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page