మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
Trinethram News : Andhra Pradesh : మాజీ మంత్రి, వైసీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. టెండర్లు లేకుండా ఇరిగేషన్ పనులు ప్రారంభించారన్న నేపథ్యంలో పొదలకూరు మండలం సంగెం, సూరాయపాళెం కనుపూరు కాలువ పరిశీలనకు గోవర్ధన్ రెడ్డి బయలుదేరారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆయన్ను హౌస్ అరెస్ట్ చేశారు. తమకు సహకరించాలని వెంకటాచలం, వేదాయపాలెం పోలీసులు కోరారు
అయితే, ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు గోవర్ధన్ రెడ్డి నివాసంకు పెద్ద సంఖ్యలో చేరుకొని ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య తోపులాట చోటు చేసుకుంది. వైసీపీ ప్లెక్సీలను టీడీపీ కార్యకర్తలు చించివేయడంతో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అప్రమత్తమైన పోలీసులు ఉద్రిక్తత పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో భారీగా పోలీసులను మోహరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App