రెవంత్ సర్కార్ వచ్చాకే ఆటోడ్రైవర్ల బతుకులు అగం

TRINETHRAM NEWS

రెవంత్ సర్కార్ వచ్చాకే ఆటోడ్రైవర్ల బతుకులు అగం

కాంగ్రెస్ ప్రభుత్వం
ఆటోడ్రైవర్ల జీవనభృతి కల్పించాలి

రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్

గోదావరిఖని త్రినేత్రం నిష్ప్రతినిధి

తెలంగాణ రాష్ట్రం లో రేవంత్ కాంగ్రెస్ సర్కారు వచ్చాకే ఆటోడ్రైవర్ల బతుకులుఅగమాయ్యాయాని, వారు జీవించే పరిస్థితి లేకుండా పోయుందని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం మాజీ ఎమ్మెల్యే నివాసంలో తెలంగాణ రాష్ట్ర ఆటో డైవర్ల యూనియన్ జే.ఎ.సి ఛలో హైదరాబాదు మహధర్నా వాల్ పోస్టర్ ను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమయంలో ప్రతి ఆటో జీవనభృతి కల్పిస్తామని, సంవత్సరానికి 12 వేలు ఇస్తానని కాంగ్రెస్ పార్టీ హామి ఇచ్చిందని కానీ అమలుకునోచుకోలేదన్నారు. 6 గ్యారెంటీల అభయహస్తం పధకంలో మహిళలు ఉచిత బస్సు తో మాకు జీవనోపాధి కరువైయుందని ఆటోడైవర్లు ఆవేదన చేందుతున్నరని తెలిపారు. ఆటో నడిపితేనే కుటుంబాలను పోషించుకునే పరిస్థితి ఆటో డైవర్లదని వారికి జీవనభృతిని కల్పించాలని ఆటో యూనియన్ జె.ఎ.సి నాయకులు డిమాండ్ చేస్తుా 5 వ తేదీన హైదరాబాదు ఇందిరాపార్క్ వద్ద మహధర్నా కార్యక్రమం చేపట్టారన్నారు. బిఆర్ఎస్ పార్టీ ఆటో డైవర్లకు అండగా ఉంటుందని చెప్పారు.
ఈ కార్యక్రమం లో కార్పోరేటర్ పెంట రాజేష్ బి.ఆర్.టి.యు ఆటోయూనియన్ రాష్ట్ర కార్యదర్శి నీలరపు రవి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రేణికుంట్ల సురేష్ నాయకులు సదానందం కడార్ల శ్రీధర్ కోర్రి ఓదేలు నామిండ్ల కుమార్ షరీఫ్ తిరుపతి బైరి సంపత్ కొంరయ్య పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top