విజయవాడ-విశాఖపట్నం విమాన సర్వీసులు ప్రారంభించిన
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు
Trinethram News : శ్రీకాకుళం
ప్రజా రాజధాని అమరావతి – ఆర్థిక రాజధాని విశాఖపట్నం మధ్య అనుసంధానాన్ని మరింత పెంచడం ఆనందంగా ఉందని కేంద్ర పౌర విమాన యాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఆదివారం విశాఖపట్నం విమానాశ్రయం లో రెండు విమానాలను ఆయన ప్రారంభించారు. కొత్తగా 2 విమాన సర్వీసులు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని, ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ ఉదయం 9.35 గంటలకు విశాఖపట్నంలో ప్రారంభమై, 10.35 గంటలకు విజయవాడ చేరుకుంటుందని వివరించారు. తిరుగు ప్రయాణంలో రాత్రి 7.55 గంటలకు బయలుదేరి, 21.00 గంటలకు విశాఖ చేరుతుందన్నారు. అలాగే ఇండిగో సర్వీసు రోజూ రాత్రి 19.15 గంటలకు విజయవాడ లో బయలుదేరి, 20.20 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుందని, తిరుగు ప్రయాణంలో 20.45 గంటలకు బయలుదేరి 21.50 గంటలకు వైజాగ్ కు చేరుకుంటుందని పేర్కొన్నారు.ఈ అనుసంధానం వల్లన ప్రజా రవాణా, రాష్ట్ర ఆర్ధిక ప్రగతి దోహద పడుతుందని ఆశిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ ప్రాంత ప్రజలు విమాన సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు విజయవాడ ఎంపీ కేశినేని శివనాధ్, విశాఖపట్నం పశ్చిమ శాసనసభ్యులు పివిజిఆర్ నాయుడు (గనబాబు), ముఖ్య నాయకులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App