వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పై వినతిపత్రం అందజేసిన డీజేఎఫ్ జిల్లా కమిటీ సానుకూలంగా స్పందించిన

TRINETHRAM NEWS

వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పై వినతిపత్రం అందజేసిన డీజేఎఫ్ జిల్లా కమిటీ సానుకూలంగా స్పందించిన

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్
అక్రిడేషన్ తో సంబంధం లేకుండా వర్కింగ్ జర్నలిస్టులందరికీ ఇండ్లు లేదా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (డిజెఎఫ్) పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం రోజున స్థానిక గాంధీ నగర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వినతిపత్రం అందజేశారు.

అనంతరం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్క జర్నలిస్టుకు తప్పకుండా ఇండ్ల స్థలాలను అందజేస్తానని, ఒకవేళ ఎవరికైనా రానిపక్షంలో ప్రత్యేక కోటాలో ఒక సంవత్సరం స్థలాన్ని, ఇంకో సంవత్సరం అందుకు కావలసిన ఆర్థిక సహాయాన్ని అందజేస్తానని అన్నారు
ఈ కార్యక్రమంలో డిజేఎఫ్ జిల్లా అధ్యక్షులు కల్లెపల్లి కుమార్, ప్రధాన కార్యదర్శి బోయిని ప్రసాద్, మహిళా అధ్యక్షురాలు పోలు దాసరి రజిత, వైస్ ప్రెసిడెంట్ మాతంగి శివరాజ్, జాయింట్ సెక్రెటరీ మహంకాళి సంపత్, కార్యదర్శి పోతుల జాన్, సమన్వయ కమిటీ చైర్మన్ తాండ శ్రీనివాస్, రామగుండం మండల అధ్యక్షుడు మామిడి స్వామి, ప్రచార కార్యదర్శి కన్నం అవినాష్, రామగుండం మండల ప్రధాన కార్యదర్శి జెషు లతో పాటు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top