TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : Oct 10, 2024,

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన దాతృత్వాన్ని చాటుకున్నారు. అన్నమయ్య జిల్లాలోని మైసూరవారిపల్లి పాఠశాలకు పవన్‌ తన సొంత నిధులతో క్రీడా మైదానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. తన సొంత ట్రస్టు నుంచి రూ.60 లక్షలతో ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి గ్రామ పంచాయతీ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఇందుకు సంబంధించిన పత్రాలను బుధవారం రాత్రి మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పంచాయతీ సభ్యులకు అందజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App