TRINETHRAM NEWS

సింగరేణి కార్మికులను అన్ని విధాలుగా ఆదుకుంటాం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్…

హైదరాబాద్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

హైదరాబాద్ ప్రజా భవన్ లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేతుల మీదుగా పంపిణీ

రామగుండం సింగరేణి కార్మికులకు ఎల్లవేళలా రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు& రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ అన్నారు.

ఈ మేరకు హైదరాబాద్ లోని మహాత్మ జ్యోతిరావు పూలే ప్రజా భవన్ లో జరిగిన సింగరేణి కార్మికులకు 33 శాతం లాభాల బోనస్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ గౌడ్ తదితరులున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సింగరేణి సంస్థ సాధించిన లాభాలలో కార్మికులకు 33% దసరా సందర్భంగా లాభాల బోనస్ పంపిణీ చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికులకు వెన్నుదన్నుగా ఉంటుందన్నారు. వారికి సమస్యలు పరిష్కరించడంలో ముందున్నదని అన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన కాంట్రాక్టు కార్మికుల విషయంలో ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వారికి లాభాల బోనస్ గా 5,000 చెక్కులను పంపిణీ చేయడం జరిగిందన్నారు.

ఈ విషయంలో గత కొద్ది నెలలుగా సింగరేణి యాజమాన్యంతో చర్చలు జరిపిన అనంతరం కార్మికుల శ్రేయస్సు కోసం పూర్తిస్థాయిలో సహకారం అందించమన్నారు. ఇందుకోసం సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ తో పాటు ఇంధన శాఖ కార్యదర్శి రోనాల్డ్ రోస్ తో పలుమార్లు చర్చలు జరిపినట్లు పేర్కొన్నారు. అనంతరం కార్మికుల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అదేవిధంగా అధికారంలోకి వచ్చిన కొద్ది సమయంలోనే రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్నారు. తద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో సింగరేణి సంస్థ అధికారులతో పాటు రాష్ట్ర మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ తోపాటు కార్మిక నేతలు ఉన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App