Solid arrangements for Bathukamma and Dussehra celebrations
బతుకమ్మ వేడుకలు, దసరా ఉత్సవాలలో గ్రామ పంచాయతీ విధులపై ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించిన పెద్దపల్లి ఎమ్మెల్యే
విధులను గ్రామ ప్రత్యేక అధికారులు పకడ్బందీగా నిర్వహించాలి..
పారిశుధ్య నిర్వహణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి..
బతుకమ్మ, దసరా వేడుకలకు పటిష్ట ఏర్పాట్లు
పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
బతుకమ్మ దసరా పండుగలు వస్తున్న నేపథ్యంలో గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు వారి విధులను పకడ్బందీగా నిర్వహించాలని ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు అన్నారు.
శుక్రవారం పెద్దపల్లి లోని నందన గార్డెన్స్ లో బతుకమ్మ వేడుకలు, గ్రామపంచాయతీ విధులపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ కలిసి పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు పెద్దపల్లి నియోజకవర్గ అధికారులతో సమీక్షా సమావేశం సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.
తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధంగా ముఖ్యమైన పండుగ బతుకమ్మ అని, ప్రతి గ్రామంలో ఈ వేడుకలు ఘనంగా జరిగేందుకు అవసరమైన ఏర్పాట్లను ప్రత్యేక అధికారులు శ్రద్ధతో చేపట్టాలని అన్నారు.
బతుకమ్మ, దసరా వేడుకల నేపథ్యంలో గ్రామాలలో అవసరమైన లైటింగ్, బతుకమ్మ ఆట స్థలాలను శుభ్ర పరచడం, బతుకమ్మ నిమజ్జనం చేసే చోట లైటింగ్, పారిశుధ్యం వంటి ఏర్పాట్లను ప్రత్యేక అధికారులు పకడ్బందీగా చేపట్టాలని అన్నారు.
గ్రామాలలో విద్యుత్ సరఫరా కు సంబంధించి ఎటువంటి కోతలు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో నిధులకు ఏదైనా ఇబ్బందులు ఉంటే వెంటనే తన దృష్టికి తీసుకుని రావాలని, బతుకమ్మ వేడుకలలో ఎటువంటి లోటు ఉంచడానికి వీలులేదని అన్నారు. రూరల్ ప్రాంతాల్లో విధులు నిర్వహించే పంచాయతీ కార్యదర్శులు, ఎంపీడీవోలు, ఎంపిఓ ప్రతిరోజు ఉదయం 9 గంటలకు క్షేత్రస్థాయిలో పారిశుధ్య పనులను పర్యవేక్షించాలని, ప్రతి రోజు చెత్త సేకరించి సెగ్రిగేట్ చేయాలని, సీగ్రేషన్ షెడ్ ద్వారా వర్మే కంపోస్ట్ తయారు చేయాలని ఎమ్మెల్యే విజయరమణ రావు అన్నారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సెక్రిగేషన్ షెడ్ వినియోగం పై అక్టోబర్ 25 నుంచి 30 వరకు స్పెషల్ ఆడిట్ నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ అరుణ తెలపడం జరిగిందని. గ్రామాలలో ఎక్కడ ప్లాస్టిక్ మరియు చెత్త కనిపించకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పి సీఈఓ నరేందర్, జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య, డివిజనల్ పంచాయతీ అధికారులు, ఎంపీడీవోలు మండల పంచాయతీ అధికారులు, కార్యదర్శులు సంబంధిత అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App