WhatsApp Image 2024 10 02 at 17.05.49
Lions Club pays tribute to Mahatma Gandhi
గాంధీ జయంతిని పురస్కరించుకొని ఖనిలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన లయన్స్ క్లబ్
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని బుధవారం గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఉచితంగా సుమారు 200 మందికి షుగర్ పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి గొడుగులు పంపిణీ చేశారు. లయన్స్ భవన్లో విద్యార్థులకి నోట్ బుక్స్, బ్యాగ్ లు పంపిణీ చేశారు. మొక్కలు నాటారు. సీనియర్ లయన్ సభ్యుడు బి లక్ష్మారెడ్డి సహకారంతో బీటెక్ చదువుతున్న పేద విద్యార్థికి 20వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. పేదలకు చీరలు పంపిణీ చేసి, రక్తదానం శిబిరం నిర్వహించారు.
అధ్యక్షులు పి మల్లికార్జున్, సెక్రటరీ వి ఎల్లప్ప, ట్రెజరర్ పి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాలలో ముఖ్య అతిథులుగా మాజీ డిస్టిక్ గవర్నర్ హనుమాండ్ల రాజిరెడ్డి, ప్రమోద్ కుమార్ రెడ్డి, సీనియర్ సభ్యులు కోదండరాం, బద్వేషం, వెంకటరమణారెడ్డి, మీల్స్ ఆన్ వీల్స్ కోఆర్డినేటర్ బంక రామస్వామి, జోనల్ చైర్మన్ కె రాజేందర్, మేడిశెట్టి గంగాధర్, తిలక్ చక్రవర్తి, మనోజ్ కుమార్ అగర్వాల్, కోలేటి శ్రీనివాస్, పోకల ఆంజనేయులు, తానిపర్తి గోపాలరావు, డి లక్ష్మిరెడ్డి ముడుతనపెల్లి సారయ్య, తానిపర్తి విజయలక్ష్మి బంక కళావతి, మగువ అధ్యక్షురాలు సునీత, డాక్టర్ లక్ష్మీవాణి, శశికళ, రంగమ్మ, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
