The management should give an explanation on the profit calculations of the Singareni company, CITU said
మంద నరసింహారావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
అర్జీ1, ఏరియా జీడీకే -2 ఇంక్లైన్ పిట్ కార్యదర్శి ఏ. శంకరన్న అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది, ముఖ్యఅతిథిగా హాజరైన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావు గారు మాట్లాడుతూ, 2023-24 సంవత్సరానికి సంబంధించిన లాభాల లెక్కలపై కార్మికులందరూ అయోమయంలో ఉన్నందున యాజమాన్యం గతంలో కార్మికులకు తెలియజేసిన మాదిరి కరపత్రం రూపంలో కార్మికులకు పన్నులకు ముందు పనుల తర్వాత సంస్థ లాభం ఎంత అనేది గత సంవత్సరం కూడా కలిపి తెలియజేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు గా డిమాండ్ చేస్తున్నామని, ప్రతిపక్షంలో ఉండగా 35 శాతం రావాలని డిమాండ్ చేసిన గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు అధికారంలోకి రాగానే ప్రభుత్వం చెప్పిన మాటలకు గంగిరెద్దుల తల ఊపుతూ కేవలం 33 శాతానికి ఒప్పుకొని రావడం మరియు పన్నులు పోగా వచ్చిన లాభాల నుండి వాటపంచాల్సి ఉండగా లాభాల డబ్బుల నుండి సగం మేర పక్కకు పెట్టి సగాన్ని పంచుతూ 33 శాతం అంటూ గొప్పలు చెప్పుకోవడం గెలిచిన సంఘాలకే చెల్లిందని ఎద్దేవా చేశారు. కేవలం గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు తప్ప మిగిలిన కార్మిక సంఘాలు కార్మికులందరూ అయోమయంలో ఉంటే దీనిపై వివరణ ఇవ్వాల్సిన యాజమాన్యం బాధ్యత రహితంగా ఉండడం వలన పారిశ్రామిక అశాంతి రేకేస్తుందని యాజమాన్యం స్పందించి కార్మికులకు లాభాలపై అనుమానాలను తొలగించే బాధ్యత యాజమాన్యం పైన ఉన్నదన్నారు.
వచ్చిన లాభాల నుండి సగం సంస్థ అభివృద్ధి కొరకు పక్కకు పెడుతున్నామని చెబుతున్న గుర్తింపు ప్రాతినిధ్య సంఘం నాయకులు సంస్థకు ప్రభుత్వం నుంచి రావలసిన 30 వేల కోట్ల బకాయిలపై ఎందుకు ప్రశ్నించలేదన్నారు. గత ప్రభుత్వం దోచుకున్నదని చెబుతున్న నాయకులే ఈ ప్రభుత్వం వచ్చాక బకాయిలను ఎందుకు వసూలు చేయలేకపోతున్నారని దానివల్ల మరింతగా లాభాలు పెరిగే అవకాశం ఉన్నదన్న సంగతి ఈ నాయకులకు తెలియదా? అని ప్రశ్నించారు. గతంలో కూడా లాభాల నుండి పక్కకు పెట్టారని చెప్తున్న నాయకులు వాటి నుండి ఏ ప్రాజెక్టులు క్రింద ఖర్చు చేశారు తెలియజేయాలని అన్నారు,
ఈ కార్యక్రమంలో అర్జీ1 బ్రాంచి అధ్యక్ష కార్యదర్శులు ఆరెపల్లి రాజమౌళి, మండే శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు తోట నరహరి రావు, బ్రాంచి ఉపాధ్యక్షులు ఎస్.కె గౌస్, వంగల రామన్న, పి శ్రీనివాసరావు, ఏ. శంకరన్న, పి. సమ్మయ్య, బీమా నాయక్, శివరామరెడ్డి, జంగాపల్లి మల్లేష్, ఈదుల సాగర్, కొండపల్లి కృష్ణ, బొంకూరు సురేష్, కార్మికులు పాల్గొన్నారు,
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App