Chakali Ailamma Jayanti celebrations in Ramagundam Commissionerate
మహిళా చైతన్యానికి, ఆత్మ చాకలి ఐలమ్మ ఒక ప్రతీక పోలీస్ కమీషనర్ ఎం శ్రీనివాస్ ఐపిఎస్.,
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
తెలంగాణ వీర వనిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయములో ఈరోజు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భముగా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్, ఐపిఎస్., (ఐజి) అధికారులు, సిబ్బంది పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.
ఈసందర్బంగా సీపీ మాట్లాడుతూ….పెత్తందార్ల దురాగతాలను,ఆనాటి నిరంకుశ రజాకార్లకు, దేశ్ ముఖ్ లకు వ్యతిరేఖంగా మొక్కవోని ధైర్యంతో ఐలమ్మ ఎదిరించిన తీరు అందరికీ ఆదర్శమని ఐలమ్మ పోరాటాలను కొనియాడారు. ఆమె చేసిన పోరాట ఉద్యమమే తెలంగాణ సాయుధ పోరాటానికి స్ఫూర్తి అని అన్నారు. మహిళా చైతన్యానికి, ఆత్మగౌరవానికి ప్రతిక అని మహిళలందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
ఈకార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి. రాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, ఏఆర్ ఏసీపీ ప్రతాప్, సురేంద్ర, ఇన్స్పెక్టర్ లు రవీందర్, అజయ్ బాబు, ఆర్ఐ దామోదర్,మల్లేశం, శ్రీనివాస్, వామన మూర్తి, సంపత్, సీపీఓ సిబ్బంది, వివిధ వింగ్స్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App