TRINETHRAM NEWS

Let’s work together for a drug-free society.. NTR’s call to the youth

దేశ భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందన్న ఎన్టీఆర్

తాత్కాలిక ఆనందం కోసం జీవితాలు నాశనం చేసుకోవద్దని హితవు

తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోతో చేతులు కలపాలని సందేశం

Trinethram News : మాదక ద్రవ్యాలకు అలవాటుపడి ఎంతోమంది తమ జీవితాలను ఛిన్నాభిన్నం చేసుకుంటున్నారని టాలీవుడ్ ప్రముఖ నటుడు ఎన్టీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. డ్రగ్స్ రహిత తెలంగాణపై తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బృందానికి సహకరిస్తూ ఎన్టీఆర్ తనవంతు బాధ్యతగా ఎక్స్ వేదికగా ప్రత్యేక వీడియో విడుదల చేశారు. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి సహకరించాలని యువతను కోరారు.

ఆ వీడియోలో ఎన్టీఆర్ మాట్లాడుతూ దేశభవిష్యత్తు యువత చేతిలోనే ఉందని పేర్కొన్నారు. తాత్కాలిక ఆనందం కోసమో, క్షణికమైన ఒత్తిడి నుంచి బయటపడేందుకో , లేదంటే స్నేహితుల ప్రభావం వల్లనో, స్టైల్ కోసమే కొందరు మాదక ద్రవ్యాలకు ఆకర్షితులవుతుండడం బాధాకరమని పేర్కొన్నారు. జీవితం చాలా విలువైనదని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వాములు కావాలని కోరారు. ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా, వాడుతున్నా వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు సమాచారం అందించాలని ఎన్టీఆర్ కోరారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Let's work together for a drug-free society.. NTR's call to the youth