జూలై 16, 2026

WhatsApp Image 2024 09 23 at 17.30.44

TRINETHRAM NEWS

Membership Registration Program in Palakurthi Mandal

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

రామగుండం నియోజకవర్గ ఇన్చార్జి కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో పాలకుర్తి మండలంలోని కుక్కల గూడూర్ మరియు రామారావు పల్లి గ్రామంలో ప్రధానమంత్రి తలపెట్టిన భ్జ్ప్ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
రామగుండం నియోజకవర్గం ఇన్చార్జి కందుల సంధ్యారాణి మాట్లాడుతూ నరేంద్ర మోడీ గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నిధులతో దీపం పథకం క్రింద వంట గ్యాస్ కనెక్షన్స్ ని అందజేయడం జరిగిందన్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల ఉచిత బియ్యం, రోడ్లు, డ్రైనేజీలు, స్మశాన వాటికలు, రైతు వేదికలు, ఉచిత విద్యుత్ అందించడం తో పాటుగా వృద్ధులకు ,వికలాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు పించన్లని కేంద్ర ప్రభుత్వం నిధులతో అందజేయడం జరుగుతుందన్నారు కరోనా టైంలో కోవిడ్ వ్యాక్సిన్ కనిపెట్టి ప్రజలకి ఉచితంగా అందజేసిన మహనుభావుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు.
ప్రపంచ దేశాలను కాపాడిన గొప్ప వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంతే కాకుండా రైతులకు రుణమాఫీ రైతుబంధు, రైతులకు యూరియా అతి తక్కువ ధరలో రైతులకు అందిస్తున్న గొప్ప వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని కొనియాడారు.
అలాంటి మహోన్నత వ్యక్తికి మనమంతా అండగా ఉండాలని కోరారు.. భారతీయ జనతా పార్టీలో ప్రతీ ఒక్కరు సబ్యత్వం తీసుకొనే విధంగా భూత్ స్థాయి నుండి ప్రతీ ఒక్క కార్యకర్త ఇందుకు కృషి చెయ్యాలని సూచించారు..
మండల పదాధికారులు వివిధ మోర్చాల పద అధికారులు బిజెపి సీనియర్ నాయకులు శక్తి కేంద్రం ఇన్చార్జిలు గ్రామ అధ్యక్షులు భూత్ అధ్యక్షులు బిఎల్ఓ లు బిజెపి కార్యకర్తలు నాయకులు గ్రామాలలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను చైతన్యం చేస్తూ బిజెపి సభ్యత్వం చేయించేలా పలు సలహలు సూచనలు ఇవ్వడం జరిగింది..
ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంల.బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలకుర్తి మండల ప్రబారి పిడుగు కృష్ణ,మేరుగు నరేష్,మేడం రాజు, కోడూరి శంకరయ్య,గోపు రామన్న, ఊర వెంకటేష్,పత్తిపాక సుధాకర్,మెండ అంజి,రంజీత్,చల్ల హరిష్,మడ్డి శ్రీను, ఎనగందుల గాంధీ, ఎసులు,కోడూరు బాపన్న,దార వేణి రమ, లక్ష్మి, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Membership Registration Program in Palakurthi Mandal

1 thought on “Membership Registration : పాలకుర్తి మండలంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం

Comments are closed.

You cannot copy content of this page